Home  »  TV News  »  గుండెలకు హత్తుకున్న జగతి ప్రేమ.. తన బాధని చెప్పుకున్న రిషి!

Updated : Apr 15, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -737 లో.. రిషి జరిగిందంతా మహేంద్ర, ఫణీంద్రలకి చెప్తాడు. ఇప్పటికైనా వాళ్ళపై యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారని రిషితో ఫణీంద్ర అంటాడు. "వాళ్ళని వదిలి పెట్టొద్దు డాడ్.. ఒక పత్రికా ప్రకటన ఇద్దాం... మళ్ళీ కాలేజీ జోలికి రావొద్దు.. పోలీస్ వాళ్ళ సహాయంతో మిమ్మల్ని పట్టుకుంటాం. అప్పుడు మీ కాలేజీ పరువు పోతుంది. ఒకవేళ మీరు ఎవరో తెలిస్తే సరైన గుణపాఠం చెబుదామంటూ ఒక నోట్ వేయించి అన్ని పేపర్స్ లో వచ్చేలా చేద్దాం" అని రిషి అంటాడు. మంచి ఆలోచన రిషి అని ఫణీంద్ర అంటాడు.

మరోవైపు వసుధార కిచెన్ లోకి వస్తుంది. బయట మీరేం తినలేదా వసుధార అని ధరణి అడుగుతుంది. లేదు మేడం అని వసుధార అంటుంది. భోజనాలు అయిపోయాయి.. మీరు బయటే తిని వస్తారని అనుకున్నా అని ధరణి అంటుంది. పర్లేదు మేడం.. రిషి సర్ కూడా ఏం తినలేదు.. ఆకలేస్తుందేమో అని ఆపిల్ కట్ చేస్తుంది వసుధార. రిషి అంటే ఎంత ఇష్టమో అని ధరణి అంటుంది. ఇష్టం కాదు మేడం.. ప్రాణం. నాకు నాకంటే కూడా రిషి సారే ఎక్కువ అని వసుధార అంటుంది. ఇదంతా రిషి వెనకాలే ఉండి విని వెళ్ళిపోతాడు. రిషి కిచెన్ లోకి వాటర్ కోసం వెళ్తుంటే.. ఏదైనా అవసరం ఉంటే ధరణి తీసుకొచ్చేది కదా రిషి అని జగతి అంటుంది. మీ శిష్యురాలిని నాకు ఇచ్చినందుకు థాంక్యూ మేడం.. మీ శిష్యురాలికి పుస్తకాలలో ఉండే పాఠాలతో పాటు జీవితానికి అవసరమయ్యే పాఠాలు కూడా చెప్పారని రిషి అంటాడు. హ్యాపీగా ఫీల్ అవుతుంది జగతి. వసుధార విషయంలో మిమ్మల్ని మెచ్చుకున్నాను. కానీ నా జీవితంలో ఒక కొరత అలాగే ఉంది.. ఇంత స్వఛ్చంగా ప్రేమించే మీరు.. నానుండి దూరంగా ఎందుకు వెళ్లిపోయారని అడగాలని ఉంది మేడం. కాని అడగను మీ ప్రేమని పొందే అదృష్టం నాకు లేదు. అది నా దురదృష్టమంటూ రిషి ఎమోషనల్ అవుతాడు. మన మధ్య ఈ అపార్థాలు చాలాసార్లు చెప్పాలని ప్రయతించాను. కానీ నువ్వు అర్థం చేసుకోలేదు.. అర్థం చేసుకునే సిచ్యువేషన్ లో నువ్వు లేవంటూ జగతి ఎమోషనల్ అవుతుంది. మా బంధం విషయంలో.. మీ ఆశలు మీవి. కానీ ఏ ఆశలేని వాణ్ణి నేను అని రిషి చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే.. రిషి అంటూ పిలుస్తుంది జగతి. నువ్వు ఒక్కడివే కాదు రిషి.. నేను బాధపడుతున్నానంటూ ఎమోషనల్ అవుతుంది జగతి. 

మరోవైపు కట్ చేసిన ఆపిల్ ముక్కలని రిషి దగ్గరకి ధరణి తీసుకొని వస్తుంది. అలా వచ్చాక రిషీతో మాట్లాడుతుంది ధరణి. వసుధారకి నువ్వు అంటే ఇష్టం ఈ శూన్యమాసం అయిపోతే.. మీ ఇద్దరి పెళ్లి అవుతుందని ధరణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.